మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తర్వాత రెండున్నరేళ్ళకి సర్కారు వారి పాటతో ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చెందుకు రంగం సిద్ధమైంది. మరొక్క ఐదు రోజుల్లో మహేష్ బాబు సర్కారు వారి పాట తో ఫాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నారు. మహేష్ ఫాన్స్ లోనే కాదు సర్కారు పాట ట్రైలర్ లో మహేష్ డైలాగ్ డెలివరీ, ఆయన లుక్స్, ఆయన యాటిట్యూడ్ చూసాక అందరిలో ఆత్రుత మొదలయ్యింది. కళావతి అద్భుతమైన అందం, పరశురామ్ దర్శకత్వం అన్ని సినిమాపై అంచనాలను పెరిగిపోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ లోను సర్కారు వారి పాట కి అద్భుతమైన బిజినెస్ జరిగింది. ఏరియాల వారీగా సర్కారు వారి పాట బిజినెస్ మీకోసం..
ఏరియా కలెక్షన్స్ కోట్లలో
నైజాం 36 కోట్లు
సీడెడ్ 14 కోట్లు
ఉత్తరాంధ్ర 13 కోట్లు
గుంటూరు 8.5 కోట్లు
ఈస్ట్ 8.5 కోట్లు
వెస్ట్ 7.2 కోట్లు
కృష్ణా 7.5 కోట్లు
నెల్లూరు 3.80 కోట్లు
టీఎస్ అండ్ ఏపీ కలిపి 90 కోట్లు
ఇతర ప్రాంతాలు 10 కోట్లు
ఓవర్సీస్ 11 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 119.5 కోట్లు