Advertisement
Google Ads BL

చిరు పై కోట శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్స్


మెగాస్టార్ ని ఇండస్ట్రీ పెద్ద అంటూ ఎంతోమంది గౌరవిస్తున్నా.. కొంతమంది మాత్రం చిరు ఇండస్ట్రీ పెద్ద అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారు. రీసెంట్ గా మంచు ఫ్యామిలీ వరసగా మెగా ఫ్యామిలీపై కామెంట్స్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మేడే రోజున జరిగిన సినీకార్మికుల ఉత్సవంలో తాను చిత్రపురి కాలనీ సినీ కార్మికుల కోసం ఓ ఆసుపత్రి ని, అలాగే సినీ కార్మికుల పిల్లల కోసం ఓ పాఠశాలని నిర్మించబోతున్నాను అని చెప్పారు. ఆ విషయంలో ఇంతవరకు ఇండస్ట్రీ నుండి ఎవరూ పెద్దగా స్పందించలేదు.

Advertisement
CJ Advs

కానీ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చిరంజీవి ఆసుపత్రిని కట్టిస్తాను అని చెప్పిన కామెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటా మాట్లాడుతూ.. చిరంజీవి కట్టించే ఆసుపత్రి ఎవరికి కావాలి.. ముందు సినీ కార్మికులకు ఫుడ్ పెట్టాలని, ఎంతోమంది సినీ కార్మికులు తినడానికి తిండి లేక,  చెయ్యడానికి పని లేక అల్లాడి పోతున్నారని, కృష్ణానగర్‌లో ఆకలితో అలమటిస్తున్న వారు చాలామంది ఉన్నారని.. అంతేకాకుండా చెడు వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారిని ముందు ముందుగా వారికి తిండి పెట్టాలని, వారి దగ్గర డబ్బులు ఉంటే.. అపోలో ఆసుపత్రికి వెళతారు కానీ.. చిరంజీవి కట్టించే ఆసుపత్రికి ఎందుకు వెళతారు అంటూ కోట చిరు పై సెన్సేషనల్ కామెంట్స్  చేసారు. 

Kota Srinivasa Rao sensational comments on Megastar:

Senior actor Kota Srinivasa Rao comments on Megastar Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs