Advertisement
Google Ads BL

ఫస్ట్ టైం కొడుకుతో కాజల్


కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉంది. బేబీ బంప్ ఫోటో షూట్స్, అలాగే బాడీ షేమింగ్ పై లెక్చర్లు అంటూ కాజల్ సినిమాలకి విరామం ప్రకటించినా సోషల్ మీడియాని వదల్లేదు. ఇక తనకి పండంటి బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తో మరో ఫోటో షూట్ తో హడావిడి మొదలు పెట్టింది కాజల్. మధ్యలో కాజల్ సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుంది అనే న్యూస్ చక్కర్లు కొట్టింది. కానీ అవన్నీ గాలి వార్తలే అని కాజల్ అగర్వాల్ డెలివరీ తర్వాత చేసిన ఫోటో షూట్ చూసాక అర్ధమైంది. ఇక కాజల్ అగర్వాల్ ఇంతవరకు తన బిడ్డ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యలేదు.

Advertisement
CJ Advs

మాతృ దినోత్సవం సందర్భంగా కాజల్ తన బిడ్డ నీల్ ని గుండెలకి హత్తుకుని ప్రేమతో ముద్దాడుతున్న పిక్ ని పోస్ట్ చేస్తూ.. ప్రియమైన నీల్ - నువ్వు నా మొదటి బిడ్డ. నువ్వు నాకెంతో ప్రత్యేకం. అలాగే ఎంతో విలువైనవాడివి.. ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటావని నేను కోరుకుంటున్నాను. నిన్ను నేను నా చేతుల్లోకి తీసుకొని, నీ చిన్న చేతిని నా చేతిలోకి తీసుకొని, నీ వెచ్చని శ్వాసను అనుభవించాను. అంతేకాకుండా నీ అందమైన కళ్ళను చూసిన క్షణం నేనెప్పటికీ మరిచిపోలేను, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటానని నీకు తెలుసు. నువ్వు నా మొదటి సంతానం, నా మొదటి కొడుకు. నువ్వే నా సర్వస్వం.. అంటూ పోస్ట్ చేసింది.

Kajal Aggarwal shares first pic of son Neil on Mothers Day:

Kajal Aggarwal Gives a Glimpse of Her Son For The First Time on Mothers Day 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs