Advertisement
Google Ads BL

సుమ కాబట్టి అదైనా.. లేదంటే..


సుమ కనకాల బుల్లితెర మీద విపరీతమైన క్రేజ్ ఉన్న యాంకర్ సుమ కనకాల. స్టార్ మహిళ దగ్గరనుండి, క్యాష్, స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, హీరోల ఇంటర్వూస్ అంటూ క్షణం తీరిక లేని జీవితంతో సుమ కనకాల చాలా రోజుల తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. సుమ కెరీర్ మొదలు పెట్టినప్పుడు హీరోయిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ వెండితెర మీద సుమ సక్సెస్ అవలేదు. మధ్యలో చిన్న చిన్న కేరెక్టర్స్ లో కనిపించిన సుమ ఇన్నాళ్ళకి జయమ్మ పంచాయితీ లీడ్ రోల్ తో ఆడియన్స్ ముందు వచ్చింది.

Advertisement
CJ Advs

అది కూడా అలా ఇలా కాదు, పెద్ద పెద్ద స్టార్స్ తో ప్రమోషన్స్ చేయించుకుని మరీ బరిలోకి దిగింది. పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్, మహేష్ తో రిలీజ్ ట్రైలర్ లాంచ్, అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాని, నాగార్జున రావడం, మధ్యలో కాలేజ్ టూర్స్, అలాగే ఛానల్స్ ప్రమోషన్స్, యూట్యూబ్ ఇంటర్వూస్ అంటూ సుమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా లో దమ్ము తెలిసింది. కనీసం సుమ సినిమాకి రివ్యూస్ కూడా రాలేదు. సుమ సినిమా, సుమ చేసిన ప్రమోషన్స్ కాబట్టే ఆ సినిమాకి ఆ మాత్రమైనా క్రేజ్ ఉంది, ఫస్ట్ డే కొద్దిగా ఓపెనింగ్స్ వచ్చాయి. సుమ పెరఫార్మెన్స్ ఎంత బాగున్నా.. సినిమా కథలో బలం లేకపోవడం, ఎమోషన్స్ సరిగ్గా పండకపోవడం సినిమాకి మైనస్ గా మారింది. కానీ సినిమాకి టాక్ తేడా కొట్టడంతో జయమ్మ పంచాయితీ రెండో రోజు కలెక్షన్స్ పడిపోయాయి. సుమక్క సినిమా కాబట్టి ఇదైనా.. లేదంటే లేదు అనేస్తున్నారు చాలామంది ఆడియన్స్.

Mixed talk to Suma Jayamma Panchayathi:

Anchor Suma Jayamma Panchayathi Public Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs