Advertisement
Google Ads BL

సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్


సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్ 

Advertisement
CJ Advs

యంగ్ హీరో సందీప్ కిషన్ బర్త్ డే నేడు. దానితో సందీప్ కిషన్ నటిస్తున్న సినిమాల నుండి స్పెషల్ అప్ డేట్స్ ఇస్తూ సందీప్ కిషన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మేకర్స్. అందులో సందీప్ కిషన్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ మైకేల్ నుండి సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసారు. అలాగే సందీప్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న భైరవకోన నుండి కూడా అప్ డేట్ ఇచ్చారు.

సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ ఊరు పేరు భైరవకోన ఫస్ట్ లుక్ విడుదల

ప్రామెసింగ్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా వైవిధ్యమైన కధాంశాలతో సినిమాలని రూపొందించే విఐ ఆనంద్ దర్శకత్వంలో డిఫరెంట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో, సందీప్ కిషన్ 28వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ,.. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ఊరు పేరు భైరవకోన అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక ఫాంటసీ ప్రపంచాన్ని చూపించారు. సందీప్ కిషన్ తన చేతిలో మంత్రదండంతో కనిపిస్తుండగా అతనికి సమీపంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ మిగతా కట్టడాలు చిన్నవిగా కనిపించడం పెర్ఫెక్ట్ ఫాంటసీ వరల్డ్ ని కళ్ళముందు వుంచింది. ఈ పోస్టర్ తో దర్శకుడు విఐ ఆనంద్ తన మార్క్ ని చూపించి ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచారు.

మేకింగ్ వీడియో విజువల్స్ గ్రిప్పింగ్ గా ఉన్నాయి. సందీప్ కిషన్ లుక్స్ ఆకట్టుకున్నాయి. వంటినిండా మంటలతో ఓ వ్యక్తి నీళ్ళలోకి దూకుతున్న సీక్వెన్స్ టెర్రిఫిక్ గా వుంది. మేకింగ్ వీడియోలో వినిపించిన నేపధ్య సంగీతం కూడా ఉత్కంఠని రేకెత్తించింది.

సందీప్ కిష‌న్‌, విజ‌య్ సేతుప‌తి, రంజిత్ జయ‌కొడి, శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్షన్స్ ఎల్ఎల్‌పి పాన్ ఇండియా చిత్రం మైఖేల్ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో సందీప్ కిషన్ వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో తనదైన మార్క్ చాటుతున్నారు. అలాగే కథలో తన పాత్రకి తగ్గట్టు సరికొత్తగా తనని తానూ మలుచుకంటున్న సందీప్ కిషన్.. రంజిత్ జయ‌కొడి దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైఖేల్‌ చిత్రంతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టారు.

సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మైఖేల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. గాడ్ ఓన్లీ ఫర్గివ్స్ అనే క్యాప్షన్ రిలిల్ చేసిన ఈ పోస్టర్ లో సందీప్ కిషన్  మునుప్పెన్నడు లేని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ దేహంతో ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధాలతో తన వద్దకు వస్తున్న క్రూరమైన వ్యక్తులుపై అంతే  క్రూరంగా సందీప్ కిషన్ గన్ తో గురిపెట్టడం ఈ పోస్టర్ గమనించవచ్చు. ఈ పోస్టర్ మైఖేల్ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందని వెల్లడిస్తుంది.

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Sundeep Kishan Birthday Special:

Sundeep Kishan birthday special looks release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs