మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మాములు విషయం కాదు, అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు అంటూ ఆచార్య ఏరియా హక్కులని భారీ ధరలకు దక్కించుకున్నారు బయ్యర్లు. వరంగల్ శ్రీను అయితే దిల్ రాజు తో పోటీకి సై అని 42 కోట్లు సమర్పించాడు. అటు సీడెడ్, ఇటు ఆంధ్ర అన్ని చోట్లా ఆచార్య భారీ నష్టాలూ మిగిల్చింది. ఆచార్య కొన్న ప్రతి ఒక్కరూ నష్టపోయారు. టేబుల్ ప్రాఫిట్ కి అమ్మేసి నిర్మాతలు చేతులు దులుపుకున్నారు కానీ బయ్యర్లు అడ్డంగా ఇరుక్కున్నారు. అందుకే ఆచార్య నష్టాలూ పూడ్చమంటూ ఆచార్య మేకర్స్, చిరంజీవిపై ఒత్తిడి పెంచుతున్నారు.
కళ్యాణ కర్నాటక రీజియన్ రాయచూర్ జిల్లాకు చెందిన రాజగోపాల్ బజాజ్ అనే వ్యక్తి ఏకంగా ఓపెన్ లెటర్ రాసేసాడు. చిరంజీవికి బహిరంగ లేఖ రాస్తూ.. తాను ఆచార్య సినిమాను భారీ ధరకు కొనుగోలు చేశానని, కానీ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్లలో ఆడలేదని ఆ లెటర్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తీవ్రంగా నష్టపోయానని చెప్పుకొచ్చాడు. వరంగల్ శ్రీనుకు చెందిన కార్తికేయ ఎగ్జిబిటర్స్‌కు భారీగా ప్రీమియం చెల్లించామన్నాడు. కానీ సినిమా చూస్తే నిరాశపరిచింది అని, కోవిడ్ కారణంగా ఒక రకంగా నష్టపోతే, ఆచార్య తో మరొక విధంగా నష్టపోయాను అని, తనని ఆదుకోవాలంటూ చిరుకి రాజగోపాల్ రాసిన ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. దేనితో మిగతా బయ్యర్లు కూడా ఆచార్య విషయంలో తగ్గేదే లే.. మాకు నష్టాలూ పూడ్చమంటూ మరింత ఒత్తిడి చేస్తున్నారట