Advertisement
Google Ads BL

NTR30: లుక్ చేంజ్ అంటున్న ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం న్యూస్ లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. కారణం అటు కొరటాల మూవీ, ఇటు ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే NTR31 మూవీస్ మాత్రమే కాదు, ఆయన తన పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ ని NTR31 దర్శకుడు, ప్రస్తుతం బ్లాక్ బస్టర్ కొట్టి క్రేజీగా మారిన కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం.. అలాగే NTR 32 దర్శకుడు బుచ్చిబాబు ప్రశాంత్ నీల్ ని మీటవడం ఇన్ని విషయాలతో ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో ఆయన ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో కాస్త బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు బరువు తగ్గడానికి డిసైడ్ అయ్యారట. ట్రిపుల్ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ ఆంజనేయస్వామి మాల వేసుకున్నారు. ఆ దీక్ష పూర్తవడంతో ఆయన.. ఇప్పుడు నార్మల్ లుక్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు కొరటాల మూవీ కోసం లుక్ చేంజ్ చేయబోతున్నారట. అందులో భాగంగా ముందు బరువు తగ్గేందుకు జిమ్ లో ప్రముఖ ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు మొదలు పెట్టబోతున్నారట. మాస్ యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ తెరకెక్కనున్న NTR30 లో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని టాక్ ఉంది. ఆ లుక్ కోసమే ఎన్టీఆర్ ఇప్పుడు ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. 

NTR look change for NTR30:

NTR to appear in a never-seen-before avatar in NTR 30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs