Advertisement
Google Ads BL

అర్జున్ తో పెళ్లిపై ఓపెన్ అయిన మలైకా


ఇప్పటివరకు పెళ్లి ఊసెత్తకుండా.. వెకేషన్స్ కి, పార్టీలకి, పబ్లిక్ గా తిరిగిన బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ లు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ బాలీవుడ్ లో మీడియాలో చక్కర్లు కొట్టడం లేదు. స్వయానా మలైకా అరోరానే ఈ విషయాన్ని చెప్పీ చెప్పక చెప్పేసింది. అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న మలైకా అరోరా పెళ్లి ఊసెత్తకుండానే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడితో విడాకులు తీసుకున్నప్పటినుండి అర్జున్ కపూర్ తో రిలేషన్ మెయింటింగ్ చేస్తున్న మలైకా అరోరా.. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. అర్జున్ కపూర్ కూడా సొంత భార్యలా ప్రొటెక్ట్ చేస్తాడు. కానీ వీరి మధ్యలో పెళ్లి పదం ఇప్పటివరకు వినిపించలేదు.

Advertisement
CJ Advs

అయితే మలైకా అరోరా తాజాగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మేమిద్దరం కలిసి నడవాల్సిన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాం. ఈ స్టేజ్ నాకు చాలా ముఖ్యమైనది. అసలు జీవితంలో నెక్స్ట్‌ ఏం చేయాలి, ఎటువైపు అడుగులు వేయాలన్నసందిగ్ధంలో మేము ఉన్నాం..  మేము చాలా విషయాలను చర్చించాము. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కలిసి జీవించే విషయమై మేమిద్దరం సీరియస్ గా ఉన్నాం, ఒకప్పుడు జోక్స్ వేసుకున్న మేము..ఈసారి సీరియస్ గా ఆలోచిస్తున్నాం, మా బంధంలో పాజిటివ్ గా, సురక్షితంగా ఉన్నాం, ఆ రెండిటిని అర్జున్ నాకందించాడు.. అంటూ మలైకా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ వాళ్ళ ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

Malaika Arora hints at wedding with Arjun Kapoor:

Malaika Arora Calls Arjun Kapoor Her Man Reveals They Want A Future Together
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs