Advertisement
Google Ads BL

కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసిషన్


కాజల్ అగర్వాల్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతోందా.. అది కూడా ఆచార్య సినిమాలో కొన్ని సీన్స్ చేసి.. తర్వాత ఆ సినిమా నుండి తొలగించబడిన బాడ్ మూమెంట్ లో కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటించిన కాజల్.. ఈ ఏడాది బిడ్డకి జన్మనిచ్చింది. దానితో ఆచార్య, ఘోస్ట్ సినిమాల నుండి కాజల్ తప్పుకుంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ సినిమాలకి బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుంది అని, ఈ నిర్ణయం ఇప్పుడే చెప్పకపోయినా.. కాజల్ ఫ్యామిలీ మెంబెర్స్ తో చర్చించిన తర్వాత కాజల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కాజల్ తన కొడుకు నీల్ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని, ఆమె తన సమయాన్ని మొత్తం బిడ్డకే పరిమితం చెయ్యాలని అనుకుంటుంది అని చెబుతున్నారు. కొన్నాళ్ళు బిడ్డ ఆలనాపాలనలో టైం స్పెండ్ చేసి.. తర్వాత అన్నీ బావుంటే మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కాజల్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ న్యూస్ చూసిన కాజల్ ఫాన్స్ కలవర పడుతున్నారు.

Kajal Agarwal Shocking Decision:

Kajal Aggarwal likely to quit movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs