Advertisement
Google Ads BL

సమంత యశోద నుండి సర్ ప్రైజ్


ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత కు పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు వచ్చింది. ఆ క్రేజ్ లో దృష్టి లో పెట్టుకుని ఆమె స్థాయి ఏమాత్రం తగ్గకుండా యశోద సినిమా చేస్తున్నాం అంటూ నిర్మాత కృష్ణ ప్రసాద్ చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే సమంత యశోద పాత్ర విషయంలో కనబరిచిన డెడికేషన్, పాత్రను సొంతం చేసుకున్న తీరు ఎక్సలెంట్. సమంత నటన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయిన యశోద నుండి నేడు గ్లిమ్ప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

Advertisement
CJ Advs

యశోద గ్లిమ్ప్స్ లోకి వెళితే.. యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ  తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశబ్దం కూడా యశోదకు చాలా కొత్త కొత్త గాను, వింత వింత గానూ అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా మెల్లిగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ, అక్కడేం జరిగింది? ఇదంతా యశోద ఫస్ట్ గ్లిoప్స్ లో కనిపిస్తుంది. జంట దర్శకులు హరి-హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చెయ్యనున్నారు.  

First glimpse of Samantha Yashoda out now!:

Attractive first glimpse of Samantha Yashoda out now!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs