Advertisement
Google Ads BL

బిగ్ బాస్: 1st బాబా భాస్కర్, 2nd అనిల్


బిగ్ బాస్ నాన్ స్టాప్ మరో రెండున్నర వారాల్లో ముగియబోతుంది. అంటే మే 22 న బిగ్ బాస్ ఓటిటి గ్రాండ్ ఫినాలే కి సిద్దమవ్వబోతుంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ సక్సెస్ ఫుల్ గా పదవ వారం పూర్తి చేసుకోబోతుంది. అయితే ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే కి వెళ్లబోయే కంటెండర్లు టాస్క్ లు నిర్వహిస్తున్నారు. గత సీజన్ హౌస్ మేట్స్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంటర్ అయ్యి టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఆడిస్తున్నారు. మొదటగా సిరి వచ్చింది.. ఆమె పెట్టిన టాస్క్ లో అఖిల్ విన్ అయినా.. బాబా భాస్కర్ కి ఆమె తెచ్చిన మ్యాజిక్ బాక్స్ ఇవ్వడంతో అది తన కోసం వాడుకున్న బాబా టికెట్ టు ఫినాలే కి వెళ్లబోయే ఫస్ట్ కంటెండర్ అయ్యాడు.

Advertisement
CJ Advs

ఇక గత రాత్రి మానస్ మ్యాజిక్ బాక్స్ తో హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ నటరాజ్ మాస్టర్ ఆ మ్యాజిక్ బాక్స్ దక్కించుకున్నాడు. కానీ టాస్క్ లో ఓడిపోయాడు. టాస్క్ లో అనిల్ విజయం సాధించాడు. దానితో అనిల్ ఫస్ట్, నటరాజ్ రెండో ప్లేస్ లో, అరియనా మూడవ స్థానంలో ఉన్నారు. అయితే అక్కడ అనిల్ కి నటరాజ్ కి మధ్యలో మ్యాజిక్ బాక్స్ వుంది. నటరాజ్ తన కోసం ఆ బాక్స్ ఉపయోగించుకుని ఓపెన్ చెయ్యగా ఓ నెంబర్ డౌన్ లోకి వెళ్ళాడు. దానితో అనిల్ సేఫ్ గా టికెట్ టు ఫినాలే సెకండ్ కంటెండర్ అయ్యాడు. ఎప్పటిలాగే నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. సో బాబా 1st కంటెండర్, అనిల్ సెకండ్ కంటెండర్ అయ్యాడు. మరి ఈ రోజు ఎవరు హౌస్ లోకి వస్తారో చూడాలి.  

Bigg Boss Non Stop: Yesterday episode highlights:

Bigg Boss Non Stop: Ticket to finale task highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs