ఈమధ్యన నార్త్ లో సౌత్ మూవీస్ సునామి ఓ రేంజ్ లో కనిపించింది. పుష్ప 100 కోట్ల క్లబ్బులో ఎంటర్ అవగా.. రాధే శ్యామ్ నార్త్ లో పల్టీ కొట్టిన తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ 2 లు హిందీ బాక్సాఫీసుని దడదడలాడించేసాయి. ఆ సినిమాలను చూసి హిందీ మూవీస్ కాదు, బాలీవుడ్ ప్రముఖులు బేజారెత్తిపోయారు. బాహుబలి టైం లో హిందీ ని పరుగులు పెట్టించిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ తోనూ ప్రతాపం చూపించారు. అంతకుముందే పుష్ప కూడా 100 కోట్ల క్లబ్బు ని సెట్ చేసింది. ఇక కన్నడ నుండి వచ్చి హిందీలో టాప్ లేపిన కెజిఎఫ్ 2 విషయంలో కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ నటుల మధ్యన పెద్ద యుద్ధమే నడిచింది.
అయితే ఇప్పుడు అఫీషియల్ గా సౌత్ మూవీస్ నార్త్ లో జెండా పాతేశాయి. అక్కడ హిందీ లో హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన టాప్ 3 లో రెండు సౌత్ మూవీస్ ఉన్నాయంటూ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. నెంబర్ వన్ ప్లేస్ లో రాజమౌళి బాహుబలి 2 నెంబర్ వన్ గ్రాసర్ గా నిల్వగా, కన్నడ సంచలనం కెజిఎఫ్ చాప్టర్ 2 సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక అమీర్ ఖాన్ దంగల్ థర్డ్ ప్లేస్ లో ఉన్నట్లుగా తరణ్ ఆదర్శ ట్వీట్ చేసారు. దానితో సౌత్ ఫాన్స్, మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు.
TOP 3 HIGHEST GROSSING *HINDI* FILMS...
1. #Baahubali2
2. #KGF2
3. #Dangal
Nett BOC. #India biz. #Hindi.