సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాస్తా ఇప్పుడు డిసాస్టర్ డైరెక్టర్ గా మారిపోయారు కొరటాల శివ. ఆచార్య లో తప్పు ఎక్కడ జరిగింది అనేది పక్కనబెడితే.. ఆ సినిమా కి అంత నెగెటివ్ టాక్ రావడానికి కొరటాలే కారణం అంటున్నారు మెగా ఫాన్స్. చిరు - చరణ్ ని హ్యాండిల్ చెయ్యడంలో కొరటాల తడబడ్డారు. ఇద్దరి స్టార్ హీరోలతో సినిమా చెయ్యాలంటే ఎలాంటి కథ కావాలి. అక్కడే కథ దగ్గరే.. కొరటాల ఫెయిల్ అయ్యారంటూ విమర్శిస్తున్నారు. దానితో కొరటాల డిఫెన్స్ చేసుకోవడానికి నానా తంటాలు౮యా పడుతున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.
ఇక రాబోయే ఎన్టీఆర్30 పాన్ ఇండియా ఫిలిం పై ఆచార్య నీడ పడకుండా.. కాస్త గ్యాప్ తోనే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాలని కొరటాల డిసైడ్ అయ్యారట. ఇప్పటికే ఎన్టీఆర్ - కొరటాల మీటింగ్ పెట్టుకుని ఆచార్య ఎక్కడ తేడా కొట్టిందో అనే విషయాలు చర్చించారని, అటు NTR30 స్క్రిప్ట్ లోను పాన్ ఇండియా లెవల్ కి తగ్గ మార్పులు చేస్తున్నారని, కెజిఎఫ్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల తర్వాత యాక్షన్ ప్రధానంగానే కథ రెడీ చెయ్యాలని ఎన్టీఆర్ కొరటాలకి సూచించాడని, ఇప్పటికే కొరటాల ఎన్టీఆర్ తో చేయబోయేది ఓ భారీ కథ, పాన్ ఇండియాకి సరిపోయే కథ అంటూ అంచనాలు పెంచేశారు. అందుకే ఆ అంచనాలకు తగ్గకుండా కొరటాల, ఎన్టీఆర్ కి పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడమే కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ - కొరటాల కలిసి ఎన్టీఆర్30 స్క్రిప్ట్ కి కాస్త అటు ఇటుగా రిపేర్లు చేస్తున్నారంటూ ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.