రామ్ చరణ్ ఆచార్య ప్రమోషన్స్ ముగించేసి.. ఆ సినిమా ఫలితాన్ని అనుభవించేసి.. ఇప్పుడు ఫ్రెష్ గా తన తదుపరి మూవీ షడ్యూల్ లోకి జాయిన్ అవుతున్నారు. కోలీవుడ్ టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రామ్ చరణ్ చేస్తున్న RC 15 షూటింగ్ మొన్నీమధ్యనే పంజాబ్ లోని అమృత్ సర్ లో జరిగింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం రామ్ చరణ్ వైజాగ్ వచ్చారు. అక్కడ వైజాగ్ లో రామ్ చరణ్ రాకతో అభిమానులు ఎయిర్ పోర్ట్ కి పెద్ద ఎత్తున చేరుకొని జై చరణ్, జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీలపై కీలక సన్నివేశాలతో పాటుగా, ఇంకొన్ని కీలక పాత్రల పై కొన్ని సన్నీవేశాలు వైజాగ్ పరిసర ప్రాంతాలల్లో చిత్రీకరణ చేపట్టనున్నారట శంకర్. అందుకోసమే చరణ్ ఈ రోజు వైజాగ్ వెళ్లారు. చరణ్ వైజాగ్ వస్తున్నారని తెలిసిన మెగా ఫాన్స్ RC 15 ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ కూడా హంగామా సృష్టిస్తున్నారు. రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడమే తరువాయి.. ఆయన ఫాన్స్ చరణ్ కారుని అనుసరిస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. ఇక చరణ్ ఈ RC 15 షెడ్యూల్ కి తన పెట్ రైమా తో అయ్యప్ప మాల తో వైజాగ్ లో కాలు పెట్టారు.