మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు నేను ఇండస్ట్రీ పెద్దని కాదు, ఇండస్ట్రీ బిడ్డని అంటూ చెబుతూనే ఉన్నారు. చాలామంది మీరే మాకు పెద్ద దిక్కు అన్నప్పటికీ.. చిరు మాత్రం చిరునవ్వుతో తోసిపుచ్చుతున్నారు. మరి చిరునే ఒప్పుకోవడం లేదు. తాను ఇండస్ట్రీ పెద్దని అని. కానీ మంచు విష్ణు ఆయన ఒప్పుకునేలా చేసేట్టుగా కనిపిస్తున్నాడు. మా ఎలక్షన్స్ అప్పటినుండి చిరంజీవి అంకుల్ కాస్తా విలన్ అంకుల్ గా అయ్యారు. మెగా ఫ్యామిలీ అంటే మంచు ఫ్యామిలీ ఒంటికాలుతో లేచి నెటిజెన్స్ చేతిలో ట్రోల్ అవుతుంది.
తాజాగా దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా మంచు విష్ణు ఓ ట్వీట్ చేసాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ రావును ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ ఇండస్ట్రీ పెద్దగా అప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణ రావు గారే ఉంటారు అని మంచు విష్ణు ట్వీట్ చెయ్యడంతో.. మళ్లీ చిరు మేటర్ హైలెట్ అయ్యింది. మెగా ఫాన్స్ అయితే మంచు విష్ణు ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరు నేను పెద్దని కాదు మహా ప్రభో అని చెబుతుంటే.. మళ్ళీ ఇండస్ట్రీ పెద్ద ఎవరూ లేరు, అలా అని ఎవరనుకున్నా కుదరదు, దాసరిగారే ఎప్పటికి పెద్ద అని చెబుతున్నాడు విష్ణు అని. మరి చిరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగానే వ్యవహరిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతమందికి ఆ తెర తొలగడం లేదు.