మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ సిద్దమవుతుంది. ఓ పక్క సర్కారు వారి పాట ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉంటే.. మరో పక్క సర్కారు వారి ట్రైలర్ సంచలనాలను సృష్టిస్తుంది. ఇక సర్కారు వారి పాట షూటింగ్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్ కి ఉన్న గ్యాప్ లో మహేష్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేసేసారు. నమ్రత, సితార, గౌతమ్, ఇంకొంతమంది ఫ్రెండ్ తో మహేష్ పారిస్ ట్రిప్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు, ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ ఫాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు.
అయితే ఇప్పుడు మహేష్ బెడ్ మీద పడుకుని ఛిల్ అవుతుండగా.. సితార తన పెంపుడు పిల్లిని చూస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే ఇట్టే వైరల్ అయ్యింది. మహేష్ క్యూట్ అండ్ స్వీట్ గా కూల్ గా కనబడుతుంటే సీతు పాప హెయిర్ వదిలేసుకొని తన పెట్ ని సీరియస్ గా చూస్తుంది. ఇక సితార ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాటలో తండ్రితో పెన్నీ సాంగ్ తో స్క్రీన్ షేర్ కూడా చేసుకుంది. ఇకపై సోషల్ మీడియాలోనే కాదు, తండ్రి కూతుళ్ళ హడావిడి సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూడబోతున్నాం.