Advertisement
Google Ads BL

ఆ విషయంలో ఆర్ ఆర్ ఆర్ గ్రేట్ అనే చెప్పాలి


ఇప్పుడు పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా రిలీజ్ అయిన రోజో, లేదంటే రెండో రోజో ఆ సినిమా ఏ ఓటిటిలో, ఎప్పుడు ఎన్ని రోజులకి రాబోతుందో అనే న్యూస్ పలు వెబ్ సైట్స్ లోకి, సోషల్ మీడియాలోకి వచేస్తుంది. దానితో స్టార్ హీరోల సినిమాలైతే థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు. లేదంటే ఆ.. ఓటిటిలో వస్తుంది కదా అప్పుడు చూద్దామంటూ ఆ ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇలా జరగడం థియేటర్స్ మనుగడకి చాలా ప్రమాదం. అయినప్పటికీ అలానే జరుగుతుంది. కానీ ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ ని రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. 

Advertisement
CJ Advs

కారణం ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యి నెలా పది రోజులవుతున్నా ఇంకా ట్రిపుల్ ఆర్ ఓటిటి డేట్ అఫీషియల్ గా బయటికి రాలేదు. అదే హిట్ అయిన సినిమా అయినా నెలకే ఓటిటికి వస్తుంది. ప్లాప్ అయితే పది నుండి 15 రోజులకి ఓటిటికి ఎక్కేస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఓటిటి రిలీజ్ గురించి ఎక్కడా అధికారిక న్యూస్ లేదు. జస్ట్ గాసిప్స్ తప్ప. ఇలా పకడ్బందీగా ఓటిటి డేట్స్  విషయంలో ఉంటే.. చాలామంది థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూస్తారు. లేదంటే ఆచార్య రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే దానికి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడం, అదే కొన్ని గంటల్లో ఆచార్య ఓటిటి రిలీజ్ డేట్ న్యూస్ లు రావడంతో.. జనాలు థియేటర్ కి వెళ్లి సినిమా చూసే ఉత్సాహం మొత్తం పోయింది. అందులోనూ ఆ సినిమాకి నెగెటివ్ టాక్ రావడం బయ్యర్లకి శాపం అయ్యింది. సో ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఇలా జరక్కపోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Blockbuster RRR film on OTT platforms soon:

Blockbuster RRR film starring Jr NTR and Ram Charan on OTT platforms soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs