ఆచార్య సినిమా ఫెయిల్ అయినా.. ఇండస్ట్రీలో మాత్రం ఆచార్య గా బాధ్యతలు చాలా పద్దతిగా నిర్వర్తిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ పెట్టి సామజిక సేవ కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసిన చిరంజీవి, ఆ మధ్యన కరోనా వచ్చిన దశలో సినిమా ఇండస్ట్రీలోని కార్మికుల్ని ఆదుకోవడానికి తనతరపున ఎంత చెయ్యాలో అంత చేసారు. సినీ కార్మికులకు నిత్యావసరాలను చిరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. అనేకమంది పేద కార్మికులని ఆదుకున్నారు. అంతేకాకుండా యోదా డైగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సినీ జర్నలిస్ట్ లకి మెగాస్టార్ చాలా తక్కువ ధర కే రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చేసిన సేవలకు అంతం అనేదే ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డబ్బులేక చావుబ్రతుకుల మధ్యన కొట్టాడుతున్నా.. మెగాస్టార్ తన వంతుగా సాయం చేసి తన దానగుణాన్ని చాటుతారు.
ఇక మే డే రోజున హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో చిరు మట్లాడుతూ చిత్రపురి కాలనిలో సినిమా కార్మికుల కోసం అన్ని హంగులతో కూడిన ఓ పెద్ద ఆసుపత్రిని, సినిమా వాళ్ళ పిల్లల కోసం ఓ స్కూల్ ని రెండిటిని నిర్మించడానికి మెగాస్టార్ ముందుకు వచ్చారు. ఇండస్ట్రీ పెద్ద అనే పిలుపు ని అంగీకరించకపోయినా సరే ఆయన చేసే పనులన్నీ, ఆయనే ఇండస్ట్రీ పెద్ద అని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాయి. రాజమౌళి వంటి దిగ్దర్శకుడు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వాళ్ళు మీరే తెలుగు సినిమా పెద్ద అన్నా కూడా చిరునవ్వులు చిందించేసి కామ్ గా సైలెంట్ గా ఉండే చిరంజీవి.. ఈ సామజిక సేవ కార్యక్రమాల ద్వారా ఆయన అంగీకారం లేకుండానే .. ఆయనే ఇండస్ట్రీకి పెద్ద అనే గుర్తింపు సంపాదించుకున్నారు.