టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవడానికి టాలీవుడ్ రెడీ అవుతుందా? అంటే టాలీవుడ్ కాదు, యాంకర్ దేవిని అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను ఆమె సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కంప్లైంట్ ఇవ్వగా.. ఆయన విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకుంటామని, ఓ మహిళని కించపరిచేలా మాట్లాడడం తప్పు అని, అతనిపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోను, అలాగే మా లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. మరోపక్క విశ్వక్ సేన్ ని మహిళా సంఘాల నేతలు చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉన్నాయని, యాంకర్ దేవికి మా సపోర్ట్ ఉంటుంది, అతనిపై కేసు పెట్టమంటూ మహిళా సంఘాల నేత దేవి ఫైర్ అవుతుంది.
నిన్న టీవీ 9 స్టూడియో లో యాంకర్ దేవికి విశ్వక్ సేన్ కి మధ్యన జరిగిన కన్వజేషన్ లో విశ్వక్ సేన్ దేవిని పరుష పదజాలంతో దూషించాడని అతనిపై మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో టాలీవుడ్ విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటు అంటూ దేవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టిఆర్ ఎస్ నేత దానం నాగేంద్ర కూడా విశ్వక్ సేన్ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అంటున్నారు.