మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన సినిమాలకి ఎంత హైప్ ఉండాలి, ఏ రకమయిన అంచనాలు ఉండాలి. అందులో ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్ కూడా చిరు తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అంటే ఆ సినిమాపై ఎలాంటి బజ్ ఉండాలి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల అంటే క్రేజ్ ఉండాలి. మరి వీరి కలయికలో తెరకెక్కిన ఆచార్య సినిమా రిలీజ్ టైం కి ఆ సినిమాపై అంత బజ్ లేదు సరికదా.. రిలీజ్ అయిన రోజున కొన్ని ఏరియాల్లో థియేటర్స్ ఫుల్ అవ్వలేదు అంటే మెగాస్టార్ చిరు కి ఎంత అవమానం. సినిమా కి ఇంకా మిక్స్డ్ టాకో, నెగెటివ్ టాకో స్ప్రెడ్ అవకుండానే ఆచార్య సినిమా కి థియేటర్స్ లో ఫుల్ గా టికెట్స్ తెగలేదు అంటే మాములు విషయం కాదు. క్రేజ్ ఉంది కదా.. అందుకే వరస సినిమాలు చేస్తున్నారు చిరు. కానీ ఆచార్య చూసాక ఆయన నెక్స్ట్ రాబోతున్న సినిమాల పరిస్థితి ఏమిటో ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక సినిమాకి మిక్స్డ్ టాక్ రావడమే ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్నారు కాదు వెనకడుగు వేస్తున్నారు. జస్ట్ బుకింగ్స్ ఉన్న మూడు రోజులు మాత్రమే జనాలు థియేటర్స్ వైపుకి వచ్చినా కనీసం మెగా ఫాన్స్ కూడా ఆచార్యని ఆదరించడం లేదు. ఇక మూడు రోజులు ముచ్చట అన్నట్టుగా శుక్ర, శని, ఆదివారాలు అంటే ఫస్ట్ వీకెండ్ ముగియడమే ఆచార్య పనైపోయింది. సోమవారం చాలా థియేటర్స్ ఖాళీగా కనబడితే.. కొన్ని థియేటర్స్ లో కాస్తో కూస్తో ఆడియన్స్ కనిపించినాఎక్కడా హౌస్ ఫుల్ అయిన దాఖలాలు లేవు.
దీనిని బట్టి చిరంజీవి నెక్స్ట్ సినిమాల విషయంలో అలోచించి అడుగువేయాల్సిందే. లేదంటే ఆచార్య విషయంలో ఏం జరిగిందో తర్వాత సినిమాల విషయంలోనూ అదే జరక్క మానదు.