విశ్వక్ సేన్ నిన్న తన ఫాన్ తో ఓ ప్రాంక్ వీడియో షూట్ చేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. ఆ వీడియో కాస్తా వైరల్ అవడం, అది ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తియ్యడం జరిగింది. ఆ ప్రాంక్ వీడియో పై విశ్వక్ సేన్ పై లాయర్ అరుణ్ కుమార్ HRC లో కంప్లైంట్ చేసారు. ఆ ప్రాంక్ వీడియో పై టీవీ 9 లో డిబేట్ పెట్టి నటుడు చిట్టి బాబు ని, లాయర్ అరుణ్ కుమార్ ని కాల్ లోకి తీసుకున్నారు. అయితే విశ్వక్ సేన్ కూడా ఆ డిబేట్ కి వచ్చాడు.. అక్కడ నేను ప్రాంక్ వీడియో చేశాను. అది పెట్రోల్ కాదు. వాటర్ తో ప్రాంక్ చేసాం. ప్రాంక్ చేస్తే హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యాలి కానీ, ఇలా కేసులు వెయ్యడం ఏమిటి .. లాయర్ అరుణ్ కి నీళ్ళకి, పెట్రోల్ కి తేడా తెలియదా? నీళ్లు అంటుకుంటాయా అనేది విశ్వక్ సేన్ ప్రశ్న.
దానికి అరుణ్ కుమార్ లైవ్ లోకి వచ్చి కోట్లాది రూపాయలతో సినిమాలు చేసి, ప్రాంక్ వీడియోస్ అంటూ మీ స్వార్ధం కోసం చెయ్యడం కరెక్ట్ నా.. నేను ఏ వ్యక్తి మీద కంప్లైంట్ చెయ్యలేదు అన్నారు. దానితో విశ్వక్ సేన్ యాంకర్ దేవి తో నా నోటి దూల వల్ల, నేను మాట్లాడిన మాటల వలన నేను డిప్రెషన్ లోకి వెళ్లానంటూ మీరు స్టేట్మెంట్ పాస్ చెయ్యడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడతా, నా పర్సనల్ లైఫ్ గురించి మీకు మాట్లాడే హక్కు లేదు, నన్ను మీరు పాగల్ శీను అన్నారు.. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేస్తాను. కానీ నేను అలా చెయ్యను, మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
దానికి టివి 9 యాంకర్ దేవి నువ్వు ముందు స్టూడియో నుండి బయటికి పో.. అనగానే విశ్వక్ సేన్ బూతులతో దేవిపై విరుచుకుపడ్డాడు. ఆ దెబ్బకి దేవి పేషేంట్స్ కోల్పోయి.. యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో అంటూ చాలాసార్లు అన్నది. . యు జస్ట్ షటప్ అంటూ విశ్వక్ సేన్ బయటికి వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.