మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చెయ్యడమే ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కేసారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లతో కలసి మహేష్ పారిస్ ట్రిప్ వేశారు. అక్కడ మహేష్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మధుర క్షణాలను నమ్రత ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అలా షూటింగ్ చేసేసి, వెకేషన్స్ కి వెళ్లిన మహేష్ సర్కారు వారి ప్రమోషన్స్ లో ల్యాండ్ అవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్ లో సర్కారు వారి పాట ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేసింది టీం.. ఇక మే 12 వరకు మహేష్ చానల్స్ కి ఇంటర్వూస్ అంటూ కాస్త బిజీ అవ్వబోతున్నారు. సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంటూ సందడి చెయ్యబోతున్నారు.
మరి ప్రమోషన్స్ ముగియగానే సినిమా రిలీజ్ ఉంటుంది. మే 12 న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ కాస్త కూల్ అవుతారు. అయితే మహేష్ తర్వాత మళ్లీ వెకేషన్స్ ప్లాన్ చేస్తారా? లేదంటే త్రివిక్రమ్ SSMB28 షూటింగ్ లో జాయిన్ అవుతారో అనే క్యూరియాసిటిలో మహేష్ ఫాన్స్ ఉన్నారు. త్రివిక్రమ్ సినిమా ఎంత ఫాస్ట్ గా మొదలు పెడితే అంత ఫాస్ట్ గా ఫినిష్ అవుతుంది. ఈలోపు రాజమౌళి స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అంటే ఈ ఇయర్ ఎండ్ నుండి మహేష్ - రాజమౌళి మూవీ కూడా పట్టాలెక్కేస్తుంది అంటూ ఫాన్స్ కలలు కంటున్నారు. అయితే సర్కారు వారి పాట తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మహేష్ త్రివిక్రమ్ సెట్స్ లో జాయిన్ అవుతారని, అదికూడా మే 31 కృష్ణ గారి పుట్టిన రోజునాడే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లొచ్చనే ఊహాగానం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.