Advertisement
Google Ads BL

యాంకర్ శివ కి నాగార్జున వార్నింగ్


మొదటి వారం నుండి తనదైన మైండ్ గేమ్ తో.. టాస్క్ లు వచ్చేసరికి ఎతిక్స్ మరిచిపోయి మరీ గేమ్ ఆడేసి, బిందు మాధవితో ఫ్రెండ్ షిప్ చేస్తూ.. తొమ్మిదివారాలవరకు వచ్చిన యాంకర్ శివకి మధ్య మధ్యలో నాగార్జున చేతిలో తిట్లు పడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా అంటే ఈ ఆదివారం ఎపిసోడ్ లోను నాగార్జున యాంకర్ శివ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అది కూడా ఆశు రెడ్డి వ్యవహారంలో. యాంకర్ శివ లేడీ గెటప్ వేసినప్పుడు ఆశు రెడ్డి తన డ్రెస్సులు శివ కి ఇచ్చింది. అయితే లగేజ్ రూమ్ లో శివ ఆశు రెడ్డి లో దుస్తులు చూపించమని, షర్ట్ బటన్స్ తియ్యమని అడిగినట్లుగా ఆశు గత వారం నామినేషన్స్ లో చెప్పి నామినేట్ చేసింది. నేను ఉద్దేశ్య పూర్వకంగా అనలేదు అన్నాడు శివ.

Advertisement
CJ Advs

అయితే అదే విషయాన్ని నాగార్జున హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఆశు కి శివ కి జరిగిన ఈ వ్యవహారాన్ని వీడియో ప్లే చేసి చూపించగా.. శివ ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడకపోయినా.. శివ అలా మాట్లాడి ఉండకూడదు అంటూ శివ దే తప్పని చెప్పారు. తర్వాత నాగార్జున ఆ వీడియో హౌస్ మేట్స్ ముందు ప్లే చెయ్యగా శివ నేను ఉద్దేశ్యంపూర్వకంగా అనలేదు కాబట్టే నామినేషన్స్ అప్పుడు అశుకి సారి చెప్పలేదు అన్నాడు. అయితే తన మాటల వలన ఆశు ఇబ్బంది పడింది కాబట్టి ఇప్పుడు అశుకి సారి చెబుతున్నా అన్నాడు. దానికి నాగార్జున ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే బాగోదని, సహించను అంటూ శివ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

యాంకర్ శివ కి నాగార్జున వార్నింగ్ :

Bigg Boss Non Stop Sunday episode highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs