Advertisement
Google Ads BL

పాన్ ఇండియా అంటే నాన్ సెన్స్


ఇప్పుడు సౌత్ లో తెరకెక్కిన మూవీస్ చాలావరకు పాన్ ఇండియా మూవీస్ గానే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తో మొదలుకుని సాహో, రాధే శ్యామ్, ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ 2 ఇలా చాలా సినిమాలు ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ గా పలు భాషల్లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇకపై చాలా సినిమాలు రాబోతున్నాయి. అయితే పాన్ ఇండియా అనే పదమే అగౌరవమని, నాన్ సెన్స్ అని అంటున్నాడు ఓ సౌత్ హీరో. అతనే సిద్దార్థ్. ఇక్కడ చేసే సినిమాలన్నీ ఇండియన్ సినిమాలే. పాన్ ఇండియా అనే పదం ఎందుకు వాడుతున్నారని అంటున్నారు సిద్దార్థ్. ప్రస్తుతం సౌత్ vs నార్త్ అన్నట్టుగా హిందీ హీరోలకి, సౌత్ హీరోలకి మధ్యన ట్వీట్స్ యుద్ధం నడుస్తున్న టైం లో సిద్దార్థ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement
CJ Advs

15 ఇయర్స్ బ్యాక్ మణిరత్నం రోజా అనే పాన్‌ ఇండియా సినిమా తియ్యలేదా.. ఈ సినిమాను ప్రతి ఒక్క భాషలో ఆదరించారు. రీసెంట్‌గా నా ఫ్రెండ్స్ కేజీఎఫ్‌2 సినిమా తీశారు. వాళ్లను చూసి గర్వపడుతున్నాను. ఏ సినిమా అయినా తమకి నచ్చిన లాంగ్వేజ్ లో చూసే హక్కు ఏ ఆడియన్స్ కైనా ఉంటుంది. అందుకే పాన్‌ ఇండియా అన్న పదం తీసేసి ఇండియన్‌ సినిమా అని పిలవాలి.. కాదు కూడదు అంటే ఏ భాషలో తీస్తే ఆ భాషతోనే పిలవాలి. కంటెంట్ బావుంది అంటే ఆ సినిమా ఏ భాషలో అయినా హిట్ అవుతుంది. పాన్ ఇండియా మూవీ అని ప్రచారం చేస్తూ బిల్డప్ ఇవ్వక్కర్లేదు అంటూ సిద్దార్థ్ పాన్ ఇండియా మూవీస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Siddharth Sensational comments on Pan india Word:

Siddharth On Pan India Word
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs