ఒకప్పుడు హీరోలకి లక్కీ హీరోయిన్ గా మారి హిట్స్ ఇచ్చిన పూజ హెగ్డే ఇప్పుడు ఐరెన్ లెగ్ గా మారింది అంటూ మూడు వరస ప్లాప్స్ ని చూపిస్తున్నారు యాంటీ హీరోయిన్స్ ఫాన్స్. అల్లు అర్జున్ డీజే తో స్టార్ట్ చేసి అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ దాకా పూజ హెగ్డే హిట్స్ కొడుతూనే ఉంది. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా ఏ ఒక్క హీరోని వదలకుండా అందరి హీరోలని చుట్టేసింది. కానీ ప్రభాస్ రాధే శ్యామ్, కోలీవుడ్ విజయ్ బీస్ట్, రామ్ చరణ్ తో ఆచార్య మూవీ తో పూజ హెగ్డే కి ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసారు. ఆ మూవీస్ సో సో టాక్ తెచ్చుకోవడమే కాదు.. ఆ సినిమాల్లో పూజ కేరెక్టర్స్ కి విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు పూజ హెగ్డే సోషల్ మీడియాని నమ్ముకుంది. ఎంత బిజీగా షూటింగ్స్ తో ఖాళీ లేకపోయినా.. తరచూ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫాన్స్ ని పడేస్తుంది. ఇక ఇప్పుడు కూడా గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ యూత్ కి నిద్ర లేకుండా చెయ్యడమే కాదు, దర్శకనిర్మాతలకు చెప్పకనే చెబుతుంది. తాజాగా మంచం మీద పడుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చిన పూజ హెగ్డే ఆ ఫోటో కి నమస్తే ఇన్ బెడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఎఫ్ 3 లో ఐటెంసాంగ్ చేస్తున్న పూజ హెగ్డే, బాలీవుడ్ చిత్రాలు తో మాత్రం బిజీగా ఉంది.