Advertisement
Google Ads BL

నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో బిగ్ బాస్ బిందు


తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో కలిసిరాక పక్క ఇండస్ట్రీకి వెళ్లినా.. అక్కడ కూడా నిలదొక్కుకోలేక సతమతమవుతూ క్రేజ్ కోసం బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి అడుగుపెట్టిన బిందు మాధవి ఇప్పుడు టైటిల్ ఫెవరెట్స్ లో ఒకరుగా మారింది. మొదటి వారంలో సో సో పెరఫార్మెన్స్ చూపించిన బిందు మాధవి.. తర్వాత తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్, నటరాజ్ మాస్టర్స్ తో గొడవలు పడుతూ మైండ్ గేమ్ తో టైటిల్ ఫెవరెట్ గా మారిపోయింది. అఖిల్ తో నామినేషన్స్ టైం లో విమెన్ కార్డు తో నేను గేమ్ ఆడడం లేదు.. నేను సింగిల్ అంటూ గ్రూప్ గా గేమ్ ఆడుతున్నవారిని చీల్చి చెండాడింది. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ రెచ్చిపోయింది.

Advertisement
CJ Advs

దానితో బిందు మాధవి ఫాన్స్ ఆమెకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో బిందు మాధవిని ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. అలాగే నామినేషన్స్ అప్పుడు కూడా టాప్ ఓటింగ్స్ తో బిందు మాధవి అఖిల్ కి చుక్కలు చూపిస్తుంది. యాంకర్ శివ తో ఫ్రెండ్ షిప్ ని కూడా చిన్న చిన్న గొడవల కారణంగా బ్రేక్ చేసుకుని సింగిల్ గా కనబడుతుంది. గేమ్ విషయంలో కాస్త వీక్ గా ఉన్నా.. మైండ్ గేమ్, నామినేషన్స్ విషయంలో తన పవర్ ఫుల్ పంచెస్ ని చూపిస్తుంది. అందుకే ఆమె ఫెవరెట్ ఫాన్స్ అంతా ఆడపులి బిందు మాధవి అంటూ నేషనల్ వైడ్ గా మరోసారి ఆమెని ట్రేండింగ్ లోకి తెచ్చి హడావిడి మొదలు పెట్టారు. ఎలాగైనా బిందు మాధవి టైటిల్ విన్నర్ అవడం ఖాయమనే మాట బలంగానే వినిపిస్తుంది.

Bigg Boss Bindu Madhavi in trending as Nationwide:

Bindu Madhavi Dominates Bigg Boss Telugu OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs