Advertisement
Google Ads BL

బాలీవుడ్ బ్యూటీ ఆస్తులు సీజ్


బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలబడేందుకు నానా తంటాలు పడుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నీడలా వెంటాడుతుంది. శ్రీలంక నుండి నటనపై మోజుతో ఇండియాలో అడుగుపెట్టిన జాక్వలిన్ ఇప్పుడు ఈడీ చేతిలో అడ్డంగా బుక్ అయ్యింది. సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి తన పలుకుబడితో జాక్వెలిన్ కు దగ్గరయ్యాడు. జాక్వెలిన్ కి కాస్ట్లీ గిఫ్ట్ లు ఇవ్వడం, ఆమెతో పరిచయం పెంచుకోవడం అన్ని విషయాల్లో ఇప్పుడు అతను జాక్వెలిన్ ని అడ్డంగా ఇరికించేసాడు. ఎప్పటినుండో మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్ కి ఇప్పుడు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది.

Advertisement
CJ Advs

జాక్వెలిన్‌కు చెందిన 7.27 కోట్ల ఆస్తులను అచాట్‌ చేసుకున్నట్లు ఈడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌ A1 ముద్దాయిగా  ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సుకేశ్‌ కి జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలడంతో.. ఇప్పుడు జాక్వెలిన్ ఆస్తులని కూడా ఈడీ సీజ్ చేసింది. ఇప్పటికే చాలాసార్లు ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్ కి ఇప్పుడు ఇది నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Jacqueline Fernandez assets worth Rs 7.27 crore attached :

Jacqueline Fernandez properties worth Rs 7 cr attached by ED in Tihar extortion case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs