ఇప్పుడు నార్త్ vs సౌత్ అన్నట్టుగా.. హిందీ మార్కెట్ పై సౌత్ మూవీస్ దాడిని అక్కడి హీరోలు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది సైలెంట్ గా లోలోపల కుళ్లిపోతుంటే కొంతమంది మాత్రం ఓపెన్ గానే వాళ్ళ అక్కసు వెళ్లగక్కుతున్నారు. పాన్ ఇండియా మూవీస్ అంటూ వరసగా బాలీవుడ్ మీద సౌత్ మూవీస్ దండయాత్ర చెయ్యడంతో బాలీవుడ్ గజగజ వణికిపోతోంది. రీసెంట్ గా కిచ్చ సుదీప్ నార్త్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చెయ్యగా.. దానికి అజయ్ దేవ్ గాన్ ఘాటుగానే రిప్లై ఇవ్వడమే కాదు.. హిందీ నేషనల్ లాంగ్వేజ్.. సౌత్ మూవీస్ ఇక్కడ డబ్ ఎందుకు చేస్తున్నారని మాట్లాడాడు. ఈ ట్విట్టర్ వార్ చివరికి రాజకీయ రంగు పులుముకుంది.
ఇప్పుడొక బాలీవుడ్ నటుడు తాను ఒక్క సౌత్ మూవీ కూడా చూడలేదంటూ సంచలనంగా మాట్లాడాడు. సౌత్ మూవీస్ మాత్రమే కాదు, కమర్షియల్ హంగులున్న ఏ మూవీ కూడా తాను చూడను అని, అలాంటి సినిమాలు చూసే ఓపిక, తీరిక తనకి లేదంటూ నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం సౌత్ vs నార్త్ వ్యవహారంపై నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ బాలీవుడ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడితే అన్నీ చక్కబడతాయని, ఒక సినిమా ఆడితే సూపర్, లేదంటే విమర్శించడం అనేది ఓ ట్రెండ్ లా మారింది అని, ఏదైనా లాక్ డౌన్ తర్వాత సినిమాలపై ఆడియన్స్ దృష్టి కోణం మారింది అంటూ నవాజుద్దీన్ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేసాడు.