Advertisement
Google Ads BL

ట్రేండింగ్ లో మంచు విష్ణు ట్వీట్


మంచు విష్ణు ఈమధ్యన ఏం చేసినా అది ఆయనకే ఎదురు వస్తుంది. కొన్ని రోజులకుగా సినిమాల్లో సత్తా చాటలేకపోతున్న మంచు విష్ణు మా ఎలక్షన్స్ లో హీరో అయ్యాడు. మెగా ఫ్యామిలీతో పెట్టుకుని మంచు విష్ణు మా అధ్యక్షుడయ్యాడు. ఆ తరవాత మెగా ఫ్యామిలీపై మంచు విష్ణు పలు కామెంట్స్ చేసి ఇప్పటికి ట్రోల్ అవుతూనే ఉన్నాడు. అయితే మొన్నామధ్యన మంచు విష్ణు ఢీ సినిమాకి 15 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఓ ట్వీట్ వెయ్యగా.. నెటిజెన్స్ మంచు విష్ణు ని ఆడుకున్నారు. ఇక ప్రస్తుతం గాలి నాగేశ్వర రావు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో గ్లామర్ ని నమ్ముకున్న మంచు విష్ణు సన్నీ లియోన్, పాయల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఆ సినిమా లొకేషన్స్ నుండి సన్నీ లియోన్ తో చేసిన ఫ్రాంక్ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు మంచు విష్ణు ఓ ట్వీట్ చేసాడు. డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీంతో ఒళ్ళంతా నొప్పులు.నాటో ట్వీట్ వెయ్యగానే అదిగో ఆచార్య సినిమా పోయింది అందుకే విష్ణు ఇలా సెటేరికల్ గా ట్వీట్ చేసాడు అంటూ ఆచార్య మూవీ రివ్యూస్, ఆ సినిమా కొచ్చిన రేటింగ్స్ కామెంట్స్ బాక్స్ లో పెట్టి మరీ మంచు విష్ణు ని ఆడేసుకుంటున్నాడు నెటిజెన్స్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఆ కామెంట్స్ చేశారంటూ నెటిజన్స్ పలు రకాలుగా విష్ణు ని ట్రోల్స్ చేస్తున్నారు. నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ ఆచార్యతో ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కావాలని ఆచార్య చిత్రాన్ని ట్రోల్ చేయడానికే మంచు విష్ణు ఈ ట్వీట్ చేసాడు అంటున్నారు. 

Vishnu Manchu on Twitter:

Manchu Vishnu tweet on Gali Nageswara Rao dance rehearsal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs