Advertisement
Google Ads BL

యంగ్ హీరో నిఖిల్ ఎమోషనల్ ట్వీట్


హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్‌ సిద్దార్థ్‌ నిన్న గురువారం హఠాన్మరణం చెందారు. అరుదైన కార్టికోబాసల్‌ డీజెనరేషన్‌ అనే వ్యాధితో శ్యామ్‌ సిద్దార్థ్‌ ఎనిమిదేళ్లుగా పోరాడుతూ.. చివరికి నిన్న రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణించడంతో నిఖిల్ చాలా బాధలో మునిగిపోయాడు. ఈ రోజు నిఖిల్ తండ్రి పై తనకున్న ప్రేమని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా సోషల్ మీడియా లో ట్వీట్ చేసాడు. తండ్రి తో తాను దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ.. నా తండ్రి మరణంతో చాలా కుంగిపోయాను. డాడీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.. మీతో కలిసి క్రాస్ రోడ్స్ లో సినిమా చూడడం, కలిసి తిరగడం, సమ్మర్ ని ముంబై లో ఎంజాయ్ చెయ్యడం, కలిసి బయట బిర్యానీ తినడం ఇవన్నీ మిస్ అవుతున్న..

Advertisement
CJ Advs

మీ కొడుకుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా.. మళ్లీ మిమ్మల్ని కలుస్తాను అని అనుకుంటున్నాను. తన తండ్రి చాలా మంచి మనసున్న వ్యక్తి అని, చాలామందికి ఆయన దిశానిర్దేశం చేసేవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వారు. మా నాన్నగారికి.. ఎన్టీఆర్ అన్నా, ఏఎన్నార్ అన్నా అంతులేని అభిమానం.. లైఫ్ ని ఎంజాయ్ చేద్దామనుకున్న సమయంలో ఆయన ఇలా మరణించడం చాలా బాధగా అనిపిస్తుంది. నిన్ను తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు డాడీ.. అంటూ నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

Actor Nikhil pens emotional post :

Actor Nikhil pens emotional post after his father demise
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs