మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలయిక అనగానే.. అబ్బో స్టోరీ లో ఎంతో ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోతె స్టార్స్ హీరోలైన తండ్రీకొడుకులు కలిసి నటించడమా అనే అనుమానం, ఆత్రుత అందరిలో ఉండడం సహజం. అందులో కొరటాల కథల్లో సామజిక అంశాలకు కొదవ ఉండదు. మెగా ఫాన్స్ ఎంతో నమ్మకం, ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆచార్య.. ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమవడంతో.. మెగా ఫాన్స్ చాలా డిస్పాయింట్ అవుతున్నారు. అసలు కొరటాల చెప్పిన ఆచార్య కథని మెగాస్టార్ ఎలా ఒప్పుకున్నారు. ట్రిపుల్ ఆర్ లో రామరాజు పాత్ర చేసిన రామ్ చరణ్ సిద్ద కేరెక్టర్ లోకి ఎలా వచ్చాడని చెవులు కొరుక్కోవడం కాదు.. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.
అందులో ముఖ్యంగా రాజమౌళి సినిమా తర్వాత చరణ్ కి హిట్ ఎలా వస్తుంది.. ప్లాప్ కాక ఇంకేముంటుంది అని, రెండు సినిమాల డిజాస్టర్ తో పూజ ఐరన్ లెగ్ గా మారింది అందుకే ఆచార్య దొబ్బింది అని, గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని, కాజల్ కి అన్యాయం చేసారు అనుభవించాలి అని, రెజినా సాంగ్ అవసరమా అని, మూవీకి వెళితే నిద్రొచ్చింది బస్సు అని, మూవీ ఆడదని, కొరటాల పెన్ లో ఫైర్ మిస్ అయ్యింది అంటూ.. ఆచార్య సినిమాపై నెటిజెన్స్ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ మొదలు పెట్టారు.