Advertisement
Google Ads BL

బిగ్ బాస్: నటరాజ్ మాస్టర్ గుండె పిండేసాడు


బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి దశకు చేరుకుంది. ఈ వారం చివరి కెప్టెన్ గా బాబా భాస్కర్ నిలిచాడు. ఇక హౌస్ లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉంది. ఈ వారం నామినేషన్స్ లో అఖిల్ ఆశు, బిందు మాధవి తప్ప మిగిలిన శివ, అరియనా, హమీద, నటరాజ్ మాస్టర్, బాబా భాస్కర్, మిత్ర శర్మలు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే బిగ్ బాస్ చివరి దశకు చెరుకోవడంతో.. ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ని హౌస్ లోకి పంపుతున్నారు. అసలు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే శివ సిస్టర్ హౌస్ లోకి అడుగుపెట్టి.. శివ - బిందు సీన్స్ బావున్నాయని, ఆమెతో రిలేషన్ మెయింటింగ్ చెయ్యమని శివకి సలహా ఇచ్చింది. అలాగే ఆశు నామినేషన్స్ లో తీసిన పాయింట్స్ కావాలనే తీసినట్టుగా అనిపించింది అని శివ ని ఎలర్ట్ చేసింది. 

Advertisement
CJ Advs

తర్వాత ఆశు మదర్ చీపిరికట్ట పట్టుకుని ఎంట్రీ ఇచ్చింది. నువ్ గేమ్ ఆడడానికి వచ్చవా ఎమోషన్స్ పెంచుకోవడానికి వచ్చావా అంటూ బెదిరించింది. తర్వాత అందరితో ఆమె చక్కగా మాట్లాడింది. ఆ తర్వాత నటరాజ్ వైఫ్ రీతూ కూతురు తో పాటు హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. కాస్త అతి కూడా చేసాడనిపించింది. రీతూ అందరితో చక్కగా మాట్లాడింది. నటరాజ్ పాపతో అందరూ బాగ్ ఆడుకున్నారు. బిందు తో నా భర్త రాక్షసుడు కాదు అంది. అయితే నటరాజ్ పాపని ఎత్తుకుని నేను నా పాప కోసమే గేమ్ ఆడాను. నేను ఎవరినైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరాడు. ఇక అరియనా పర్సనల్ విషయాలు మాట్లాడినందుకు రీతుకి సారి చెప్పింది. పాపతో ఆడుకుంటూ ఉండగా హౌస్ మేట్స్ అందరూ అరవడంతో పాప ఏడుపు స్టార్ట్ చేసింది. ఊరుకోబెట్టడానికి ఓ సాంగ్ ప్లే చేసాడు బిగ్ బాస్. మరి ఈ రోజు ఏ ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో చూడాలి.

Family Members enter in Bigg Boss Non Stop House:

Bigg Boss Telugu OTT: Ashu mother comes with a broomstick; asks if she is in BB house only for emotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs