Advertisement
Google Ads BL

మెగా ఫ్యామిలీకి ఆచార్య స్పెషల్ షో


టాలీవుడ్ ఆచార్యడు మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో సందడి చెయ్యబోతున్నాడు. మెగాస్టార్ ఆచార్య ఇక్కడ ఏప్రిల్ 29 నే రిలీజ్ అవుతుంది. కానీ ఓవర్సీస్ లో రికార్డ్ థియేటర్స్ లో ఈ రోజు నైట్ నుండే ప్రీమియర్స్ షోస్ మొదలైపోతున్నాయి. సైరా నరసింహ రెడ్డి తర్వాత చిరు నుండి వస్తున్న ఆచార్య పై భారీ అంచనాలున్నాయి. అందులోను ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.. ఇక ఆచార్య ప్రమోషన్స్ తో టీం ఈరోజువరకు బిజీ బిజీగానే గడిపింది. ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో చిరు, చరణ్, కొరటాల శివ లు చాలా విషయాలు ఆచార్య గురించి పంచుకోవడమే కాదు.. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ముచ్చట్లు కూడా మీడియాకి అందాయి. 

Advertisement
CJ Advs

ఆ ఇంటర్వ్యూలోనే పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ బయటికి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ ఆచార్య స్పెషల్ షో ప్లాన్ చేశారట. మెగా ఫ్యామిలీ కోసం ఓ థియేటర్.. థియేటరే బుక్ చేశామని, మెగా ఫ్యామిలి అంతా కలిసి ఆ థియేటర్ లోనే ఆచార్య ని చూడబోతున్నట్లుగా మెగాస్టార్ చిరు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే మెగా ఫ్యామిలీతో కలిసి పవన్ కళ్యాణ్ ఏ థియేటర్ లో ఆచార్య చూడబోతున్నారో అనేది మాత్రం చిరు రివీల్ చెయ్యలేదు.. కానీ మహేష్ AMB మాల్ లోనే ఆచార్యని మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ వీక్షించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.  

Acharya Special Show for Mega Family:

Pawan Kalyan to watch a special screening of Acharya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs