గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించాలని ఉంది అంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ అలితో సరదాగా షో లో చెప్పిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పెరఫార్మెన్స్, ఎన్టీఆర్ డాన్స్ అన్ని తనకి చాలా ఇష్టమని ఖుష్బూ చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో సీనియర్ హీరోయిన్ తారక్ తో కలిసి నటించాలని ఉంది అంటూ తన కోరికని బయట పెట్టింది. ఆమె రాధికా శరత్ కుమార్. రీసెంట్ గా రాధికా అలి తో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చారు. ఆ షో లో చాలా విషయాలను పంచుకున్న రాధికా చిరు తో వ్యక్తిగతంగా తనకి ఉన్న స్నేహం గురించి, అలాగే చిరు తో కలిసి చేసిన సినిమాల గురించి చెప్పిన రాధికా.. చిరు ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ లో చాలా బాగా యాక్ట్ చేసారని.. అలాంటివి చూసినప్పుడు గర్వంగా ఉంటుంది అని చెప్పారావిడ.
ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఏ హీరోకి అమ్మగా, అత్తగా నటించాలని అనుకుంటున్నారనగానే.. తారక్ తో కలిసి పని చెయ్యాలని ఉంది అని, తారక్ మంచి నటుడే కాదు, ఆయన మంచి డాన్సర్ అని, తారక్ తో కలిసి నటించాలన్నది తన కల.. తారక్ సినిమాలో ఏదో ఒక కేరెక్టర్ లో కనిపించాలి, అతని తో కలసి సినిమా చెయ్యాలి అని ఉంది.. అని ప్రస్తుతం యూగ్ హీరోస్ ని చూస్తే ముచ్చట వేస్తుంది అని, అందరూ మంచి టాలెంట్ ఉన్న హీరోలు అంటూ రాధిక చెప్పుకొచ్చింది.