Advertisement
Google Ads BL

నటుడిపై అత్యాచార ఆరోపణలు, కానీ..


ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అయ్యిపోయింది. మీ టూ ఉదయమాన్ని వేడెక్కించినా.. ఇంకా ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి మోం చేసేవారు ఇండస్ట్రీలో పెరిగిపోతూనే ఉన్నారు. ఎంతగా ఈ విషయమై గొంతెత్తినా ఇంతవరకు దాన్ని రూపు మాపలేకపోయారు. కొంతమంది గొంత్తెత్తి అరుస్తున్నారు. కొంతమంది కామ్ గా ఉంటున్నారు. అయితే తాజాగా మలయాళ ఇండస్ట్రీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు మీడియాలో హైలెట్ అయ్యింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, నిర్మాత విజయ్ బాబుపై ఓ మహిళా దారుణమైన ఆరోపణలు చేస్తుంది. తనకి అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి తనపై పలుమార్లు అత్యాచారం చేసాడంటూ ఆమె కేరళ కోజీకోడ్ లో కేసు పెట్టింది. 

Advertisement
CJ Advs

కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో తనపై విజయ్ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడని, మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకు విజయ్ బాబు తనని పలు మార్లు అత్యాచారం చేస్తూనే వచ్చాడని ఆ మహిళా తన ఫిర్యాదులో తెలిపింది. ఏప్రిల్ 22న విజయ్ బాబుపై నటి ఫిర్యాదు చేసినా.. కానీ ఇంత వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని తెలుస్తోంది. అయితే విజయ్ బాబు మాత్రం ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేస్తానని.. అసలు తానే బాధితుడునని, ఆ మహిళని అంత తేలిగ్గా విడిచి పెట్టనని వార్నింగ్‌ ఇచ్చాడు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Malayalam Actor Vijay Babu Charged With Sexual Assault:

Malayalam Film Producer Vijay Babu Charged With Rape, Revealing Survivor Identity
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs