పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో ఇంతవరకు భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టనే లేదు.. జూన్ లో మొదలు పెడతామని చెబుతున్న సినిమా నుండి డైలాగ్ లీక్ ఏమిటి అనుకుంటున్నారా.. అదేనండి భవదీయుడు దర్శకుడు హారిష్ శంకర్.. ఆచార్య ని సిద్ద ని ఇంటర్వ్యూ చేసారు. చిరు - చరణ్ ఆచార్య ఇంటర్వ్యూలో ఆయన తాను తెరకెక్కించబోయే సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ ని లీక్ చేసి పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారు. భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించిన విషయం ఆ సినిమా ఫస్ట్ లుక్ లోనే అర్ధమైంది.
అయితే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ కన్నా.. ఆయన ఎలివేషన్ ఎలా ఉండబోతుంది అనేది హరీష్ శంకర్ బయట పెట్టారు. పవన్ మీద ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ అలా నడిచి వస్తున్నప్పుడు ఆయనతో పాటుగా ఎంతోమంది స్టూడెంట్స్ కదిలి వస్తారు. ఆ సీన్ చూసి విలన్.. మొన్న వీడు ధైర్యంగా మాట్లాడితే వాడి ధైర్యం ఏంటా అనుకున్నాను, వీడి వెనకాల ఇంతమంది ఉన్నారనా అంటాడు కానీ.. విలన్ పక్కనే ఉన్న వ్యక్తి ఆ లక్ష మంది వీడి వెనుక ఉన్నారని కాదు, ఆ లక్ష మంది ముందు తాను నడుస్తున్నాడన్న ధైర్యం అంటూ పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేస్తూ మాట్లాడతాడు.. ఇది హరీష్ చెప్పిన భవదీయుడు డైలాగ్.. దానితో ఈ డైలాగ్ లో పవన్ ని ఊహించుకుంటూ ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.