Advertisement
Google Ads BL

బిగ్ బాస్: కిల్లర్ రివీల్, హౌస్ మేట్స్ షాక్


బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఇప్పటివరకు పెట్టిన టాస్క్ ల కన్నా ఈ టాస్క్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కిల్లర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో నటరాజ్ కిల్లర్ గా హౌస్ మేట్స్ ని చంపే పని పెట్టారు బిగ్ బాస్. అందులో నటరాజ్ ఎవరికి దొరక్కుండా అనిల్, అరియనా, శివ లని గత రాత్రి ఎపిసోడ్ లో చంపేశాడు. ఇక ఈ రోజు కంటిన్యూ కానున్న ఎపిసోడ్ లో మరో ఇద్దరిని చంపినట్టుగా ప్రోమో వదిలారు.

Advertisement
CJ Advs

అయితే బిగ్ బాస్ అందరిని లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టి మీరు ఎవ్వరిని కిల్లర్ గా అనుకుంటున్నారు.. దానికి తగిన కారణం చెప్పుమనగా.. బిందు లేచి.. శివ అనుకుంటున్నాను. శివ ఈ రోజు ఉదయం నుండి సస్పెక్ట్ గా వ్యవహరిస్తున్నాడని అనగానే.. మిత్రా లేచి బిందు అనుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక ఆరియానా అఖిల్ పేరు చెప్పి అశు, మిత్రా వీళ్లంతా గ్రూప్ గా ఆడుతున్నారేమో అని చెప్పగా అశు లేచి అఖిల్ పేరు చెప్పింది. ఒక కిల్లర్ మరో కిల్లర్ పేరు చెబుతుంది అంటూ అరియనా కామెంట్ చేసింది. ఇక బాబా భాస్కర్ అనిల్ అనుకుంటున్నట్లుగా చెప్పాడు. దానితో బిగ్ బాస్ మీరెవరూ కిల్లర్ ని కనిపెట్టలేదు.. అందుకే కిల్లర్ గా మొదటి కెప్టెన్సీ టాస్క్ పెరఫార్మెర్ గా నటరాజ్ పేరు చెప్పగానే హౌస్ మేట్స్ షాక్ కి గురయ్యారు. తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఫోన్ తో నటరాజ్ మరో షాక్ ఇచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Bigg Boss Nonstop: Killer Reveal, HouseMates Shock:

Bigg Boss Telugu OTT: Killer in the task revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs