పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్ప లుక్ తోనూ, ఆయన పెరఫార్మెన్సు తోనూ పుష్ప కి వందల కోట్లు లాభాలు తెచ్చిపెట్టారు. సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్ పుష్ప రాజ్ మాస్ స్టయిల్ కే ఫాన్స్, నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. నార్త్ లో ఎలాంటి అంచనాలు ప్రమోషన్స్ లేకుండానే 100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది పుష్ప. దానితో అల్లు అర్జున్ స్టామినా ఏమిటో ప్రూవ్ అయ్యింది అక్కడ. అందుకే పుష్ప 2 కి భారీ క్రేజ్, అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ క్రేజ్ తో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ కూడా పెంచేసారట.
ఇప్పటికే అల్లు అర్జున్ నార్త్ లో పుష్ప రైట్స్ అడుగుతున్నారని, లేదంటే 100 కోట్ల రెమ్యునరేషన్ కావాలని పట్టుబడుతున్నట్లుగా వార్తలొచ్చాయి. అటు సుకుమార్ 50 కోట్లు అందుకుంటున్నారట. కానీ అల్లు అర్జున్ మాత్రం 100 కోట్లు ఇవ్వండి.. లేదంటే నార్త్ పుష్ప రైట్స్ అయినా ఇవ్వండి అని మేకర్స్ దగ్గర తన డీల్ పెట్టారట. ప్రస్తుతం మైత్రి వారు ఈ విషయమై చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక భారీ బడ్జెట్ తో పుష్ప ద రైజ్ ని మించి పుష్ప ద రూల్ ఉండబోతుంది అని, ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేద్దామనుకున్న పుష్ప 2 ని కొద్దిగా ముందుకు జరిపి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. జూన్ నుండి పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది.