ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల విడాకులు తీసుకోబోతున్నారు, సుమ కనకాల తన ఇద్దరి పిల్లలతో రాజీవ్ నుండి సపరేట్ గా వేరే ప్లాట్ లో ఉంటుంది అంటూ గత ఏడాది సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ కనకాల ఈ వార్తలపై సెటైర్స్ వేశారు కానీ.. సుమ మాత్రం ఇంతవరకు ఈ డివోర్స్ మేటర్ ని ఎక్కడా ఎత్తలేదు. నిజంగా అలా ప్రచారం జరిగిన టైం లో రాజీవ్ కనకాల - సుమ కలిసున్న ఫొటోస్ కూడా ఎక్కడ కనిపించలేదు. మొన్న శ్రీరామ నవమికి సుమ - రాజీవ్ కళ్యాణం చేసేవరకు.. అలానే జరిగింది.
తాజాగా సుమ జయమ్మ పంచాయితీ ప్రమోషన్స్ లో రాజీవ్ తో విడాకుల విషయంపై మొదటిసారి స్పందించింది. భార్య భర్తలకు గొడవలు రావడం సహజమే. మా మధ్యలోను చాలానే గొడవలు వచ్చాయి. 23 ఏళ్ళ మా కాపురంలో ఎన్నో గొడవలొచ్చాయి. భార్య భర్త విడాకులు తీసుకోవడం ఎంతోసేపు పట్టదు కానీ.. తల్లితండ్రులుగా డివోర్స్ తీసుకోవడం కష్టం అంటూ సుమ ఎమోషనల్ అయ్యింది. అయితే సుమ కి రాజీవ్ కి మధ్యన విభేదాలు నిజమే అనే విషయాన్ని సుమ చెప్పకనే చెప్పి పిల్లల కోసమే కాంప్రమైజ్ అయినట్టుగా చెప్పడమే ఇప్పుడు మరోసారి అనుమానాలకు తావిస్తోంది.