కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తాను తెరకెక్కించిన సినిమాలన్నీ విజయం సాధించడంతో ఇప్పుడు రాబోతున్న ఆచార్య పై కూడా అంతే అంచనాలున్నాయి. అయితే మెగాస్టార్ చిరు తో తెరకెక్కించిన ఆచార్య లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆచార్య లో ఆ పాత్ర మొదట్లో మహేష్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ మహేష్ ఒప్పుకోకపోవడంతో ఆ కేరెక్టర్ లోకి రామ్ చరణ్ వచ్చారని అన్నారు.
అదే విషయాన్ని ఈ రోజు ఆచార్య రిలీజ్ ప్రెస్ మీట్ లో ఓ మీడియా మిత్రుడు కొరటాలని అడగగా.. కోరటాల మాములు ట్విస్ట్ ఇవ్వలేదు. అదేమిటంటే.. ఆచార్య లో అసలు మహేష్ బాబు ని నటింపచేయాలని తాము ఆలోచించనే లేదని.. కానీ మీరే అలోచించి అనుకున్నారని చెప్పి ట్విస్ట్ ఇచ్చారాయన. అంతేకాకుండా మొదట్లో చరణ్ పాత్ర నిడివి కొంచెమే.. తర్వాత ఆ పాత్ర నిడివి పెంచారట కదా అని అడిగితె దానికి కూడా కొరటాల అదిరిపోయే సమాధానం చెప్పారు. అసలు చరణ్ పాత్ర ముందు ఎంత అనుకున్నామో ఇప్పుడు కూడా అంతే ఉందని అందులో తగ్గించింది.. లేదంటే నిడివి పెంచింది కానీ ఏమీ లేదని చెప్పారు కోరటాల శివ.