రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత ఆచార్య ఈవెంట్ లో మెరిశారు. అయితే రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ తో మూవీ కమిట్ అయ్యారు. అయితే మహేష్ తో మూవీ ఈ ఏడాది చివరిలో మొదలు పెట్టబోతున్నట్లుగా ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే రాజమౌళి మహేష్ తో చేసే మూవీ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసిన ఇంకా రాజమౌళి ఓకె చెయ్యలేదు అని చెప్పారు. ఒక సినిమా ప్రమోషన్స్, రిలీజ్ అయ్యాకే మరో సినిమా కథ గురించి ఆలోచిస్తా అన్నారు జక్కన్న. అయితే అటు మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యారు.
సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అవడం, పిల్లలు స్కూల్స్ కి హాలిడేస్ రావడంతో.. మహేష్ బాబు ఫ్యామిలీతో సహా దుబాయ్ ట్రిప్ వేసినట్లుగా నిన్న మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఫిక్స్ అయ్యారు. ఇక రాజమౌళి కూడా నిన్న ఉదయమే దుబాయ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి మహేష్ - రాజమౌళి దుబాయ్ లో కలుసుకుని కథ పై చర్చిస్తారేమో అంటూ మహేష్ ఫాన్స్ చర్చించుకుంటున్నారు. అందుకే రాజమౌళి కూడా దుబాయ్ వెళ్లారు అని, మహేష్ తో మీటింగ్ కోసమే అంటూ ప్రచారం షురూ అయ్యింది.