కన్నడ నుండి ఎలాంటి అంచనాలు లేకుండా ఇండియన్ బాక్సాఫీసు మీద దాడి చేసిన కేజిఎఫ్ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాతో ప్రశాంత్ నీల్ - యశ్ ప్రపంచానికి పరిచయమయ్యారు. అందరూ ఒక్కసారిగా కన్నడ వైపు తలెత్తి చూసారు. అదే క్రేజ్ తో అవే అంచనాలతో కేజిఎఫ్ చాప్టర్ 2 రావడం, రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తేవడంతో.. ఇప్పుడు అందరూ కన్నడ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే కేజిఎఫ్ లో నటించిన స్టార్స్ వివరాలు, వారు అందుకున్న పారితోషకాలపై తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
అందులో ముఖ్యంగా హీరో రాఖీ భాయ్ యశ్ కేజిఎఫ్ కి 30 కోట్లు అందుకున్నట్లుగా తెలుస్తుంది. మాములుగా 20 కోట్లు తీసుకునే యశ్.. ఈ పాన్ ఇండియా మూవీకి 30 కోట్లు తీసుకున్నారట. కేజిఎఫ్ ని విజయతీరానికి చేర్చి అదిరిపోయే క్రెడిట్ కొట్టేసిన ప్రశాంత్ నీల్ 15 కోట్లు అందుకున్నారట, అలాగే హీరోయిన్ గా చిన్నపాటి రోల్ కోసం శ్రీనిధి శెట్టి 3 కోట్లు తీసుకుందట. ఇక అధీరా గా భయపెట్టిన సంజయ్ దత్ 9 కోట్లు తీసుకున్నాడు. సంజయ్ దత్ కి ఇది మొదటి సౌత్ ఇండియా మూవీ. ఇండియా ప్రధానిగా రమిక సేన్ రోల్ చేసిన రవీనా టాండన్ 1.5 కోట్లు అందుకుంది అని, ప్రకాష్ రాజ్ 80 నుండి 90 లక్షలు, న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ దీపా హెగ్డే పాత్రలో మాళవిక అవినాష్ ఆ పాత్ర కోసం 60-62 లక్షలు అందుకున్నట్లు సమాచారం