Advertisement
Google Ads BL

కాజల్ పేరు ప్రస్తావించనే లేదు


ఆచార్య సినిమాలో అసలు కాజల్ ఉన్నట్టా.. లేనట్టా.. ఇప్పుడు ఇదే కాజల్ ఫాన్స్ లో సాధారణ ఆడియన్స్ లో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఆచార్య సినిమాలో చిరు కి జోడిగా కాజల్ నటించింది.. షూటింగ్ ఫినిష్ చేసింది, పర్సనల్ లైఫ్ లో మాతృత్వం కోసం తపన పడింది. అయితే ఆచార్య సినిమాలో కాజల్ నటించలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఆచార్య టీం. ఆఖరికి దర్శకుడు కొరటాల శివ కూడా కాజల్ పేరే ఎత్తడం లేదు. అంతెందుకు నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకల్లో కాజల్ పేరుని ఒక్కరు కూడా ఎత్తలేదు. చిరంజీవి పూజ హెగ్డే ని తెగ పొగిడేశారు. పూజ నువ్వు నాతో నటిచాల్సింది.. చరణ్ తో నటించావ్ అంటూ మట్లాడారు. 

Advertisement
CJ Advs

కానీ తన పక్కన హీరోయిన్ గా చేసిన కాజల్ ని మరిచారు. అలాగే కొరటాల, రామ్ చరణ్ ఇలా ఎవ్వరూ కాజల్ పేరు ప్రస్తావించలేదు. కనీసం మా హీరోయిన్ కాజల్ కి అబ్బాయ్ పుట్టాడు ఆమెకి బెస్ట్ విషెస్ ఆచార్య తరపున అని చెప్పినా బావుండేది. ట్రైలర్ లో కాజల్ ని కట్ చేసినట్లుగా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ పేరే లేపేశారు. పెళ్లి చేసుకుని ఆచార్య సెట్స్ కి వచ్చినప్పుడు భార్యా భర్తలని సన్మానించడం ఎందుకు.. ఇలా కాజల్ పేరుని పక్కనబెట్టి బాధ పెట్టడం అవసరమా అంటూ ఆమె ఫాన్స్ ఆచార్య టీం పై ఫైర్ అవుతున్నారు. 

Acharya team should have at lease wished Kajal:

Acharya pre release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs