Advertisement
Google Ads BL

సుమ ప్రశ్నలు: చిరు-చరణ్ చిలిపి సమాధానాలు


ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో మెగాస్టార్ చిరు నటించిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మెగాఫాన్స్ నడుమ రాజమౌళి అతిధిగా.. చరణ్ - చిరు, చిరు నెక్స్ట్ మూవీస్ దర్శకులు, నిర్మాతలతో ఆచార్య ఈవెంట్ వేదిక కళకళలాడింది. చిరంజీవి ఏవి, చరణ్ ఏవి అంటూ స్టేజ్ పై చూపించగా.. రాజమౌళి గెస్ట్ గా సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక చరణ్ తో ఆయన భార్య ఉపాసన కూడా ఈ ఈవెంట్ కి వచ్చింది. అయితే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై యాంకర్ సుమ చిరు - చరణ్ లని ఫాన్స్ అడిగారంటూ  కొన్ని చిలిపి ప్రశ్నలు వేసింది.

Advertisement
CJ Advs

చిరంజీవి గారు మీకు మీ అమ్మగారి వంటలంటే ఇష్టమా లేదంటే సురేఖ గారి వంట అంటే ఇష్టమా అని అడగగా.. దానికి చిరు మా అమ్మగారి వంట ఇష్టం అని చెప్పారు. దానితో సుమ సురేఖ గారు గుర్తుపెట్టుకోండి అనేసింది. ఇక చరణ్ తో చరణ్ మీరు చిరంజీవి గారిని ఆచార్యగా భావిస్తారా? లేదంటే పవన్ కళ్యాణ్ ని భావిస్తారా? అంటే అది చెప్పలేను అన్నాడు చరణ్. కానీ చిరు మాత్రం చరణ్ ఆన్సర్ నేను చెబుతా అంటూ క్రమ శిక్షణ నా నుండి, కళ్యాణ్ లోని చిలిపి అల్లరిని నేర్చుకున్నాడు అన్నారు. అలాగే చరణ్ మీకు మీ నాన్న గారంటే భయమా? లేదంటే మీ వైఫ్ ఉపాసన అంటే భయమా అనగానే ఉపాసన సిగ్గుపడిపోయింది. కానీ చరణ్ మాత్రం మా నాన్నగారికి మా అమ్మ అంటే భయం.. నేను నాన్నగారిని చూసి అలానే నేర్చుకున్నాను అనగానే.. హా అలా అయితే నువ్ సుఖపడతావ్ అంటూ చిరు చరణ్ కి చెప్పారు. 

ఇక కొరటాల శివ ని చరణ్ మంచి డాన్సర్ ఆ.. లేదంటే చిరు మంచి డాన్సర్ ఆ అనగానే.. చిరు నేనే మంచి డాన్సర్ ని నేను శివ శంకర వార ప్రసాద్ ని. అందుకే నేను మంచి డాన్సర్ ని అన్నారు. ఇక కొరటాల గారు చిరు - చరణ్ ఇష్టమా? లేదంటే మీ సినిమాలో ఆచార్య - సిద్ద ఇష్టమా?  అనగానే నాకు ఆచార్య  - సిద్ధ ఇష్టమంటూ చెప్పారు.

Acharya Pre Release Event highlights :

Anchor Suma questions- CHiru and Charan answers 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs