Advertisement
Google Ads BL

నెటిజెన్స్ కి దణ్ణం పెడుతున్న సింగర్ సునీత


సింగర్ సునీత.. ఎపుడూ ఏదో ఒక న్యూస్ తో వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది సునీత రెండో పెళ్లి మీడియాలో హైలెట్ అయ్యింది. మొదటి భర్తకి విడాకులిచ్చి పిల్లలతో ఒంటరి జీవితం గడిపిన సునీత.. రామ్ ని రెండో వివాహం చేసుకుంది. అప్పట్లోనే సునీతపై ట్రోల్స్ నడిచాయి. అయినా సోషల్ మీడియాలో తనని కామెంట్స్ చేసే వారికి గట్టిగా బుద్ది చెప్పే సునీత.. ఈసారి మాత్రం నెటిజెన్స్ కి ఏకంగా దణ్ణం పెట్టేసింది. ఎందుకంటే సునీత ఈ రోజు తన ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ మామిడి చెట్టుకి ఉన్న మామిడి కాయని పట్టుకుని.. బ్లెస్సెడ్ అంటూ పిక్స్ పోస్ట్ చేసింది.

Advertisement
CJ Advs

దానితో సింగర్ సునీత మళ్ళీ తల్లి కాబోతుంది. అందుకే ఆమె మామిడికాయలు చూపిస్తూ బ్లెస్సెడ్ అంటూ తికమకగా పోస్ట్ పెట్టింది అని సోషల్ మీడియా లో సునీత పిక్స్ ని వైరల్ చేస్తూ నెటిజన్స్ నానా హడావిడి చెయ్యడంతో షాకయిన సునీత వెంటనే.. క్రేజీ పీపుల్ నేను ఒక మామిడి చెట్టుకి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేయగా.. ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు అర్ధాలతో రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ.. దండం రా నాయనా అంటూ సునీత ట్వీట్ చేసింది.

Singer Sunitha Shares A Photo With Mango:

Singer Sunitha Reaction on new post
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs