రాజమౌళి దేశం గర్వించ దగిన దర్శకుల్లో ఒకరు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ మూవీస్ తో పాన్ ఇండియా దర్శకుడిగా రాజమౌళి నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్లారు. ఆ రెండు సినిమాలతో టాలీవుడ్ అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేసారు. అయితే ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారో.. లేదో.. తెలియదు కానీ.. ఇప్పుడు సడన్ గా ఆయన న్యూస్ లోకి వచ్చారు. అందులో ఒకటి ఈ రోజు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా రావడం.
రెండవది రాజమౌళి ఓ కాస్ట్లీ కారు కొనడం. రాజమౌళి రీసెంట్ గా ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారు ని బుక్ చేసారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి ఆ కారు తాలూకు తాళాలను అందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి కొన్న ఆ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు ఉంటుందట. ఫ్యూజన్ రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారు లో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయట. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళి కారు ముచ్చట్లే హైలెట్ అయ్యాయి.