Advertisement
Google Ads BL

నన్నెవరూ అరెస్ట్ చెయ్యలేదు: జీవిత


నిన్న శుక్రవారం సాయంత్రం నగరిలో జీవిత రాజశేఖర్ పై 26 కోట్లు ఎగ్గొట్టారంటూ జోస్టర్ ఫిలిమ్స్ అధినేత కేసు పెట్టిన విషయం తెలిసిందే. జీవిత రాజశేఖర్ ఈకేసులో అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ వాళ్ళు మాట్లాడడంతో.. మీడియాలో జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యు అయ్యింది అంటూ ప్రసారం అయ్యింది. గరుడ వేగ టైంలో తమ ఆస్తులని తాకట్టు పెట్టి మరీ 26 కోట్లు జీవిత రాజశేఖర్ కి ఇవ్వగా.. వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో అప్పటినుండి వారిపై కేసు నడుస్తుంది అని, కానీ ఇప్పుడు తమ ఆస్తులను బినామీ పేర్ల మీదకి మార్చి తమని మోసం చేస్తున్నారంటూ జోస్టర్ ఫిలిమ్స్ అధినేతలు పేర్కొన్నారు.

Advertisement
CJ Advs

అయితే తనపై వస్తున్న ఆరోపణలు, తాను అరెస్ట్ అయ్యానంటూ వస్తున్న న్యూస్ లపై జీవిత రాజశేఖర్ స్పందించారు. తాము ఎవరిని మోసం చెయ్యలేదని, తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం తమకి ఉంది అని, తనని ఎవరూ అరెస్ట్ చెయ్యలేదు అని, తాను ఎక్కడికి పారిపోలేదు అని, తమకి 26 కోట్లు ఇచ్చామని చెబుతున్న వారు కావాలనే తమ మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, తాము ఎవరికీ అప్పు లేము అంటూ జీవిత రీసెంట్ గా జరిగిన శేఖర్ రిలీజ్ డేట్ అంనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు.

None of me was arrested: Jeevitha Rajasekhar:

Jeevitha Rajasekhar Faces Allegations of Cheating a Person
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs