మెగా ఫాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు కారణం.. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ అయ్యింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఇక రాబోయే ఆచార్య విషయంలోనూ మెగా ఫాన్స్ అంచనాలతోనే ఉన్నారు. చిరు - చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అందులోను సెన్సార్ టాక్ కూడా ఆచార్య హిట్ అంటూ సంకేతాలు ఇవ్వడంతో ఫాన్స్ హ్యాపీ మోడ్ లోకి వెళ్లారు. కానీ ఇంతలోనే మెగా ఫాన్స్ లో టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. కారణం రామ్ చరణ్ ప్రెజెంట్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో RC15 చేస్తున్నారు. ఆ సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది. కారణం శంకర్ మీద నమ్మకం. కానీ ఇప్పుడు మెగా ఫాన్స్ ఆందోళనకి కారణం RC15 కారణం కాదు.
RC16 గురించి మెగా ఫాన్స్ ఇప్పుడు ఆందోళన పడేది. ఎందుకంటే రామ్ చరణ్ తన RC16 ని గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోతుంది. జెర్సీ సినిమా చూసి చరణ్ గౌతమ్ కి ఛాన్స్ ఇచ్చారు. అయితే అదే జెర్సీ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసిన గౌతమ్.. అక్కడ మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. జెర్సీ హిందీ వెర్షన్ కి మిక్స్డ్ టాక్ పడడం, అక్కడ వెబ్ సైట్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ రావడంతో.. అదే దర్శకుడితో రామ్ చరణ్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో.. ఆ సినిమాకి హైప్ ఉంటుందో లేదో అంటూ మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. గౌతమ్ తిన్ననూరి షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ రీమేక్ చేసాడు. ఇక అక్కడ జెర్సీ కొద్దిపాటు సమస్యలతో నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ చూసిన మెగా ఫాన్స్ టెంక్షన్ లోకి వెళ్లిపోతున్నారు.