20 రోజుల్లో అంటే మే 12 న విడుదలకు రెడీ అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట నుండి అప్ డేట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మహేష్ ఫాన్స్ సర్కారు వారి పాట అప్ డేట్స్ తో ఫుల్ ఖుషీగా వున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట నుండి థమన్ మ్యూజిక్ లో రెండు పాటలు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసాయి. మహేష్ బాబు సిగ్నేచర్ స్టెప్స్, మహేష్ హ్యాండ్ సం లుక్స్ తో కళావతి సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. తర్వాత పెన్నీ సాంగ్ తో మెస్మరైజ్ చేసిన థమన్.. నుండి ఇప్పుడు మూడో సింగిల్ వచ్చేసింది. ఇది సర్కారు వారి పాట టైటిల్ సాంగ్.
సరా సరా సరా సర్కారు వారి పాట అంటూ హారిక నారాయణ్ ఆలపించిన ఈ సాంగ్ లిరిక్స్ అనంత శ్రీరామ్ అందించారు. థమన్ మ్యూజిక్, మహేష్ మాసివ్ లుక్స్, మహేష్ హీరోయిజం ఎలివేట్ చేసేదిలా ఈ సాంగ్ ఉండడం, అలాగే వన్ రూపీ కాయిన్ ఎగరేసి జేబులో వేసిన మహేష్ లుక్స్ మాత్రం మాస్ గా అదిరిపోయాయి. విలన్స్ తో యాక్షన్ సీన్ టైం లో వచ్చే బ్యాగ్రౌండ్ సాంగ్ గా ఈ టైటిల్ సాంగ్ చూస్తే తెలుస్తుంది. మహేష్ మెడ మీద రూపాయి కాయిన్ పచ్చ బొట్టు, మహేష్ కార్ లో నుండి దిగి విలన్స్ తో చేసే యాక్షన్ సన్నివేశాలు, మహేష్ ఫేస్ లో కోపం.. అన్ని మహేష్ మాస్ లుక్స్ ని తలపిస్తున్నాయి. మరి మీరూ సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వినేసి ఎంజాయ్ చేసెయ్యండి.