Advertisement
Google Ads BL

బాలీవుడ్ లో మరో బ్రేకప్


బాలీవుడ్ లో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్స్ అన్ని చాలా సహజం. కాకపోతే సెలబ్రిటీస్ కాబట్టి అలాంటి న్యూస్ లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఈమధ్యనే అనన్య పాండే - ఇషాన్ ఖత్తర్ ల ప్రేమ కి శుభం కార్డు వేస్తూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు అనన్య పాండే, ఇటు ఇషాన్ లు మాత్రం ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. మధ్యలో అలియా భట్ - రణబీర్ కపూర్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. గత వారం రోజులుగా ఆ పెళ్లి ముచ్చట్లే మీడియాలో హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో బ్రేకప్ న్యూస్ బయటికి వచ్చింది.

Advertisement
CJ Advs

అది బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ చైర్ కోసం ఫైట్ చేస్తున్న కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రలు విడిపోబోతున్నారు కాదు విడిపోయారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. గత రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. ఎవరి సినిమాల షూటింగ్స్ లో వారు బిజీగా ఉన్నప్పటికీ.. డేటింగ్, లంచ్ మీటింగ్, పార్టీలు అంటూ బాగా ఎంజాయ్ చేసారు. కియారా వీరి రిలేషన్ పై ఓపెన్ అవ్వకపోయినా సిద్దార్థ్ మల్హోత్రా ఒకసారి కియారా తో బంధం పై ఓపెన్ అయ్యాడు. అయితే తాజాగా కియారా, సిద్దార్థ్ స్నేహితులు.. వీరికి బ్రేకప్ అయిన విషయాన్ని ద్రువీకరిస్తున్నారు. మీడియా.. సన్నిహితులు కూడా కియారా - సిద్దార్థ్ హోత్ర బ్రేకప్ గురించి చెప్పడమే కాదు.. వారి మధ్యన విభేదాలు తొలగిపోయి మళ్ళీ ఒక్కటి అవ్వాలని కోరుకుంటున్నారు.

Sidharth Malhotra and Kiara Advani Break-Up?:

Sidharth Malhotra-Kiara Advani have separated
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs